టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే గాక, ఫుల్ పాపులర్ అయిన సితార, ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. ముఖ్యంగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో, సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది. అతి చిన్న వయస్సులోనే ఇలా ఒక ప్రముఖ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం సినిమా, ఫ్యాషన్ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ కానప్పటికీ వారికంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉండే ఫాలోవర్స్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.
సితార నిత్యం సామాజికి మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సితార తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ గాగ్రా చోళిలో అదిరిపోయే ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ అందం ముందు బడా బడా హీరోయిన్లు కూడా నథింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.