హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

hidra-08.jpg

హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కొత్త హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS సీఎం‌కు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లోని వసతులను సమీక్షించడంతో పాటు, హైడ్రా విభాగానికి కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అందులో 55 స్కార్పియోలు, 21 ట్రక్కులు, 4 ఇన్నోవాలు, అనేక ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇవి హైడ్రా పరిధిలో భద్రతా సేవలను మరింత సమర్థవంతంగా చేయడంలో ఉపయోగపడనున్నాయి.

Share this post

scroll to top