భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పాక్ దళాలు సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడుతున్నాయి. ప్రతిదాడిగా భారత దళాలు నియంత్రణ రేఖ వెంబడి అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసిన తర్వాత, పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్‌లతో భారత్‌పై దాడికి దిగింది. వాటిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. కనీసం 50 పాకిస్తాన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ సైనిక పోస్టును ధ్వంసం చేస్తున్న మొట్టమొదటి అధికారిక వీడియోను ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది. సైనిక పోస్టులను దాడి చేయడానికి యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఉపయోగించినట్లు సమాచారం.
పాకిస్తాన్‌పై దాడి అధికారికంగా విడుదల..
