అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

cm-cbn-09.jpg

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లా లో పర్యటించనున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్‌ పనులను ఆయన పరిశీలిస్తారు. శుక్రవారం ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం ఛాయాపురానికి చేరుకుని ఆ తర్వాత రోడ్డు మార్గాన ఆ గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. ఛాయాపురం ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు.

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10:35 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. 10:40 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి 11:20 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 11:30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 12:00 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం చేరుకుంటారు. 12:10 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ఛాయాపురం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పరిశీలిస్తారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతారు.

Share this post

scroll to top