రాబోయే 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని, వేసవి వేడిగాలుల నుండి ప్రజలకు స్వల్ప ఉపశమనం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణకు 3 రోజుల పాటు భారీ వర్షసూచన..
