భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న రోజు నుంచి ప్రధాని మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. భారత్ పై పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ప్రతి అంశాన్ని ప్రధాని మోడీ అధికారులు, మంత్రులు చర్చిస్తున్నారు. కాల్పుల విరమణ అనంతరం తాజా పరిణామాలు, ఈ రోజు పాకిస్తాన్ తో చర్చల నేపథ్యంలో మరోసారి ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీతో పాటు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, NSA అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. కాగా మధ్యాహ్నం 12 గంటలకు పాకిస్తాన్, భారత్ డీజీఎమ్‌వో అధికారులతో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రత్యేకతను సంప్రదించుకుంది.
ప్రధాని మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం..
