చేసిన సినిమాలు అలా కంప్లీటైన సినిమాలు పరిస్థితి మరోలా..

heroin-13-.jpg

బేబీ జాన్ ప్లాపుల జాబితాలోకి చేరడంతో రాజ్ కుమార్ రావ్‌తో జోడీ కట్టిన భూల్ చుక్ మాఫ్ పై హోప్స్ పెట్టుకుంది. తీరా ఇప్పుడు ఈ సినిమా థియేటర్ల నుండి తప్పుకుని ఓటీటీకి యూటర్న్ తీసుకుంది. ఇక తమిళంలో ఎప్పుడో కంప్లీట్ చేసిన ఇరవకాలం అయితే పత్తానే లేదు. వస్తుందో రాదో కూడా డౌటే. ఎస్ జే సూర్య హీరోగా చేసిన ఇరవకాలం 2018 నుండి విడుదలకు నోచుకోవడం లేదు. 2023లో స్టార్టైన జయం రవి ఫిల్మ్ జీని కూడా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. వామికా దశాబ్దన్నర కాలం నుండి యాక్టింగ్ చేస్తున్నప్పటికీ ఓన్ ఇండస్ట్రీ పంజాబీలో తప్ప మిగిలిన ఇండస్ట్రీలో పెద్దగా సత్తా చాటలేకపోతుంది. అయినప్పటికీ మేడమ్ చేతిలో ఆఫర్లకు వచ్చిన ఢోకా లేదు. అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. పంజాబీ మూవీ కిక్లీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక హిందీలో భూత్ బంగ్లా, దిల్ కా ధర్వాజా ఖోల్ నా డార్లింగ్ చేస్తోంది. మలయాళంలో టికి టాకాకు కమిటైంది. తెలుగులో సుమారు దశాబ్ద కాలం తర్వాత గూడఛారి2లో యాక్ట్ చేస్తోంది. అడవి శేష్ ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్‌గా యాక్ట్ చేస్తోంది. వీటిలో ఒక్కటైనా వామికాను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో.

Share this post

scroll to top