బ్యాక్ టు బ్యాక్ మూవీస్..

bachan-14-.jpg

టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు రవితేజతో నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఈ మూవీ హిట్ సాధించనప్పటికీ భాగ్యశ్రీ బోర్సేకు ఫుల్ పాపులారిటీ మాత్రం దక్కింది. అమ్మడు నటన, అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్‌గా మారింది. ఈ చిత్రంతో భాగ్యశ్రీ క్రేజీ బ్యూటీగా మారి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ భామ రామ్ పోతినేని రాపో-22, దుల్కర్ సల్మాన్ కాంత వంటి సినిమాల్లో నటిస్తోంది.

అంతేకాకుండా ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలోనూ నటించనున్నట్లు టాక్. ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే భాగ్యశ్రీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. దుబాయ్‌లో స్కై డైవింగ్ చేసిన ఆమె వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ అనే క్యాప్షన్ జత చేసి పోస్ట్ పెట్టింది. ఇందులో విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్లగా అందులోంచి దూకేస్తోంది. ఈ అడ్వెంచర్ చేసిన భాగ్యశ్రీ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది చూసిన నెటిజన్లు వావ్ అని షాకింగ్ ఎమోజీలు షేర్ చేస్తుండగా మరికొందరు ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.

Share this post

scroll to top