హైదరాబాద్ సహా తెలంగాణలో జల్లులు, కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి 22నాటికి ఉత్తరాంధ్ర తీరాన్ని చేరుతుందని, 23వ తేదీకి ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
తెలంగాణకు భారీ వర్షసూచన..
