కమలాసిని గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మే 18 రాత్రి ఆమె గుండెపోటతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి కమలాసిని భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తన తల్లి అండతోనే చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 80కు పైగా సినిమాల్లో నటించాడు భరత్. చిన్న వయసులోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.
అయితే మధ్యలో చదువు కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చిన్నప్పుడు చాలా బొద్దుగా కనిపించిన భరత్ పెద్దయ్యాక మాత్రం ఫిట్ బాడీతో హీరోలా రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలో సెకెండ్ హీరోగా ఆకట్టుకున్నాడు.చివరగా గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాలో కనిపించాడు భరత్. ప్రస్తుతం తనే సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.ఈ క్రమంలోనే హీరోగా తన ఎదుగుదలను చూడకుండా తన తల్లి తిరిగిరానిలోకాలను వెళ్లిపోయింది. దీంతో భరత్ ఢీలా పడిపోయాడు. తన తల్లిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడస్తున్నాడు. అందులోను తన తల్లి భౌతిక కాయం దగ్గరనే భరత్ కింద కూర్చున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అందర్నీ ఈ యంగ్ హీరో పరిస్థితి చూసి ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.