వైసీపీ మాజీ ఎమ్మెల్యే, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి గొప్ప మనసు చాటుకున్నారు. భారత సైన్యానికి జొన్నలగడ్డ పద్మావతి భారీ విరాళం అందించారు. ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం చూపించిన తెగువ, సాహసం,త్యాగాన్ని గౌరవిస్తూ హైదరాబాద్లోని ఆర్మీ సంక్షేమ నిధికి జొన్నలగడ్డ పద్మావతి రూ.10 లక్షల విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును జొన్నలగడ్డ పద్మావతి, సంస్థ వైస్ చైర్మన్ రంజిత్ రెడ్డితో కలిసి ఆర్మీ అధికారులకు అందించారు. మరోవైపు ఈ విరాళాన్ని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థల తరపున అందించినట్లు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ట్వీట్ చేశారు. తమ విద్యాసంస్థల్లో విద్యతో పాటు దేశభక్తి విలువలను పెంపొందిస్తామని జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం..
