తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత వర్సెస్ కెసిఆర్ ఫ్యామిలీ అన్నట్లుగా రాజకీయాలు మొదలయ్యాయీ. కెసిఆర్ కు కల్వకుంట్ల కవిత లేఖ రాయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ తరుణంలోనే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంటూ బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బీఆర్ఎస్లో కాక రేపుతోంది. బీఆర్ఎస్-బీజేపీ సహకరించుకుంటున్నాయని ప్రజలు అనుకుంటున్నారన్న కవిత వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. కవిత కుటుంబంలో లుకలుకలు ఆమె సొంత విషయమని స్పష్టం చేశారు. పార్టీ పెట్టినా తమ మద్దతు ఉండదని కేసీఆర్ పై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కవిత కొత్త పార్టీ బిజెపి సంచలనం..
