టాలీవుడ్‌లో విషాదం..

krishna-24-.jpg

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ అనారోగ్యంతో కన్ను మూశారు. ముకుల్ దేవ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తుంది. ముకుల్ దేవ్ 1996లో దస్తక్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ విలన్ సినిమాలోనూ నటించారు.  అదేవిధంగా సిద్ధం, కేడి, అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ సినిమాల్లో నటించాడు. అలాగే హిందీలో  సన్ ఆఫ్ సర్దార్, ఆర్ రాజ్‌కుమార్, జై హో, యమ్లా పగ్లా దీవానా వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. హిందీతో పాటు, పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో కూడా నటించారు. ఆయన చివరి చిత్రం అంత్ ది ఎండ్. ఆయన తమ్ముడు, నటుడు రాహుల్ దేవ్ కూడా బాలీవుడ్‌లో నటుడిగా రాణిస్తున్నారు.

Share this post

scroll to top