విజయవాడ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి స్టేషన్ లో బాంబు ఉందని బెదిరించడంతో స్టేషన్ లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కంట్రోల్ రూమ్ కు వచ్చిన కాల్ మహారాష్ట్రలోని లాతూర్ లొకేషన్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా శనివారం ఉదయం బీసెంట్ రోడ్డులోనూ బాంబు ఉందని యూనానిమస్ కాల్ రావడంతో పోలీసులు షాపులు మూయించేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి, బాంబు లేదని నిర్థారించుకున్నాక షాపులు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. వెంటవెంటనే బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.
విజయవాడ రైల్వేస్టేషన్ కి బాంబు బెదిరింపు..
