టీటీడీ ప్రాంగణంలో నమాజ్ చేసిన వ్యక్తి..

raja-sing-24.jpg

టీటీడీ ప్రాంగణంలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రాజా సింగ్. తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేసాడు ఓ వ్యక్తి. నమాజ్ చేసిన వ్యక్తి చెన్నైకి చెందిన కారు డ్రైవర్ గా గుర్తించారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నమాజ్ కావాలని చేశాడా లేదా అమాయకూడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇక ఈ అంశం పై తెలంగాణ బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ స్పందించారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డును తనిఖీ చేయాలని డిమాండ్ చేశారన్నారు. ఒకవేళ అన్యమతానికి చెందిన డ్రైవర్లు ఉంటే వారిని ఆపేయండి అని డిమాండ్ చేశారు. వారికి నో ఎంట్రీ అని ప్రచారం చేయండి తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహించారు తెలంగాణ బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్.

Share this post

scroll to top