ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీప్ దిశగా కొనసాగుతుండడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ఎక్కడ, ఎప్పుడంటే..?
