మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు హరీశ్ రావు సహకారం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని… అందుకే 8 మంది ఎంపీలను ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు. వంద రోజుల పాలన తర్వాత తమకు 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు.