CM నుంచి అటెండర్ వరకు.. ఇక బయోమెట్రిక్ అటెండెన్స్!

tg-biometric-.jpg

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు ఆఫీసుల్లో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ముందుగా సెక్రటేరియట్ నుంచే శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సచివాలయంలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు సీఎంతో సహా, మంత్రులు, సీఎస్, సెక్రటరీల నుంచి మొదలుకుని కిందిస్థాయి అటెండర్ వరకు పంచింగ్ చేయడం తప్పనిసరి చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచేందుకు బయోమెట్రిక్ అడెండెన్స్ తప్పనిసరి చేయాలని సీఎం యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Share this post

scroll to top