గంగుల పార్టీ మార్పుపై వీడిన సస్పెన్స్ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి..!

brs.jpg

పదేళ్లు ఏకధాటిగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్‌కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై పవర్ కోల్పోయిన ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా షాక్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు వరుసగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం కారు దిగి హస్తం గూటికీ చేరనున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే, బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీని వీడుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. గంగుల గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగుల కమలాకర్ 29 మంది కరీంనగర్ కార్పొరేటర్లతో కలిసి గులాబీ బాస్ కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిశారు. ఆదివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్, కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మార్పు వార్తలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ గంగులతో పాటు ఇతర నేతలకు ధైర్యం కల్పించినట్లు తెలుస్తోంది. పార్టీ వీడొద్దని.. తెలంగాణలో భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని భరోసా కల్పించినట్లు టాక్.

Share this post

scroll to top