సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా రెండు వారాలుగా జిల్లాలో టీడీపీ మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాషీ్టకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మహిళలనే విచక్షణ మరిచి ఆటవికంగా హింసకు పాల్పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లపై శిలఫలకాల ధ్వంసాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్థలాల కబ్జా సాగిస్తున్నారు. జగనన్న లేఅవుట్లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా పనిచేసిన నేతల ఆస్తులను కాల్చి బూడిద చేశారు. వీరి ఆటవిక చర్యలను అడ్డుకునేందుకు సాహించలేక మౌనంగా రోధిస్తున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ప్రజలు గుర్తుచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయకపోయినా.. సంక్షేమ పథకాలు అందించారని ప్రజలు అంటున్నారు. నారా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? అని మండిపడుతున్నారు.
