విద్యార్థినికి వేధింపులు.. లెక్చరర్‌పై ఫోక్సో కేసు..

ap-17-.jpg

విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు. కామాంధులుగా మారిపోయి. విద్యార్థినిపట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినిలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ లెక్చర్‌పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు. వాష్ రూమ్ కి విద్యార్థిని వెళ్తుండగా వెంటపడిన రామకృష్ణ. ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అడ్డుచెప్పిన విద్యార్థిని మెడను గట్టిగా నొక్కి ఇబ్బంది పెట్టాడు.. భయాందోళనకు గురైన విద్యార్థిని అధ్యాపకుడిని ప్రాధేయపడింది. ఎంత చెప్పినా వినకపోవడంతో అతని బారినుంచి తప్పించుకున్న ఆమె హాస్టల్ కు పరుగులు తీసింది. అయితే, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తమ కూతురు మానసికంగా కృంగి పోయి ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో కాలేజీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అడ్డతీగల జూనియర్ కళాశాలకు చెందిన రామకృష్ణ అనే అధ్యాపకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

Share this post

scroll to top