టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమాలు చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్‌కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్‌కు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు పనికి పనికిరాడు. ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం.