ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. రూ. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్‌రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్ష్యాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేండ్ల నుంచి కేసును రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’ అని ఎమ్మెల్యే ఆరే చెప్పారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవి. విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో నిందితులైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కేసు ట్రయల్‌ని హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్- భోపాల్ మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కి రిజాయిండర్ దాఖలు చేసేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు.