వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల కోసం వైయస్ జగన్ గారు పోరాడుతున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం, బలగం. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతికి మేము వ్యతిరేకం. ఏపీలో నెలన్నరగా దారుణాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన హింసపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాం.. వాటిని చూసి రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకి మాతో కలిసి గళం విప్పాలని కోరుతున్నాం. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
రాష్ట్రంలో జరిగిన హింసపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌ను..
