ఏపీలో రైతులకు వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా పాడి రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ ప్రోత్సాహాకాలు అందిస్తోంది. ఈ మేరకు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీే ప్రభుత్వం ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని అధికారుల్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 2014-2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు తోడ్పాటును అందించేందుకు “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” పథకం అమలు చేశారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కానీ వైఎస్సార్‌సీపీ హయాంలో పథకం అమలు చేయలేదని.. పాల సేకరణలో నిబంధనలు విధించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఏన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యం..
