పోలవరంకి కేంద్రం ఎలా సహకరించనుంది..

polavaram-27.jpg

పోలవరం ఊపిరి పీల్చుకుందా..! పోలవరం ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలిమబ్బులు తొలగిపోయాయా..? చిక్కుముడులు వీడాయా..? ఇక ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుందా..? పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే.. అని కేంద్రం ప్రకటించడం, బడ్జెట్‌లో కూడా నిధులిచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. క్రిటికల్‌ కండీషన్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఊపిరిలూదినట్లయ్యింది. అటు ఏపీలో చంద్రబాబు సర్కార్‌తో పాటు ప్రజలు కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఇక మంచిరోజులొచ్చినట్లేనని అంటున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో సవాళ్లేంటి..? ఇన్నాళ్లూ నత్తనడకన సాగడానికి కారణమేంటి..? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా పూర్తి చేయాలనుకుంటోంది..? కేంద్రం దీనికి ఎలా సహకరించనుందో చుడాలి.

Share this post

scroll to top