పొద్దంతా ఇంట్లోను, బయట పనులు చేస్తూ అసలిపోతుంటారు. ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. తీరిక లేకుండా ఆఫీసు పనులు లేదా ఇంట్లో ఉండే వారికి వంట పనులు, ఇంటి పనులు అంటూ రకరకాల పనులు ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని సార్లు రోజంతా పనిచేసినా కూడా అస్సలు అలసిపోకుండా చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఏ పని చేసినా కూడా త్వరగా అలసిపోతుంటారు. రోజంతా పని చేయడం వల్ల శరీరంలో శక్తి అంతా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సార్లు కొంచెం పని చేసినా కూడా అలసిపోతుంటాం. అయితే దీనికి కారణం శరీరంలో శక్తి లేకపోవడమే అని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. అంతేకాదు ముఖ్యంగా ప్రోటీన్లు శరీరానికి అందకపోవడం వల్ల శక్తిని కోల్పోతుంది. అందువల్ల తరచూ ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు గుండె బలం పెరగడానికి లేదా రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా శరీరానికి ప్రొటీన్లు అవసరం.
రోజంతా పనిచేసి అసలిపోతున్నారా..
