భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీచేయను..

darmnna-1.jpg

శ్రీకాకుళం జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్‌ రావు ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీచేయబోనని తన స్నేహితులు, సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులంటే ఏ మాత్రం గౌరవం లేదని.. అనుభవం గల నేతల సలహాలు, సూచనలు తీసుకోవడం అటుంచి, ముసలోడంటూ కించపరిచే తత్వం నాయకత్వాల్లో పెరిగిపోయిందన్నారు ధర్మాన. ఆత్మగౌరవాన్ని చంపుకొని రాజకీయాల్లో కొనసాగడంకంటే, దూరంగా ఉండి పెద్దరికం నిలుపుకోవడం మంచిదన్న నిర్ణయానికి ధర్మాన వచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Share this post

scroll to top