ఎంపీ కేశినేని చిన్ని పుట్టిన రోజు వేడుకల్లో బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన సీఐల బదిలీల విషయంలో ఎమ్మె్ల్యేల మాట నెగ్గిందని, తన మాట చెల్లలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న అసహనం వ్యక్తం చేశారు. తనకు ఏ పదవి లేకపోవడంతో తాను ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై చాలా పోరాటాలు చేశామని, తనపై 37 కేసులు పెట్టారని గుర్తు చేశారు. అయినా తనకు ఎమ్మెల్యే టికెట్ల దక్కలేదని, కానీ తాను ఫీల్ కాలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు. వ్యతిరేకంతో చెబుతున్న మాటలు కావని, ఆవేదన అంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను సీఎం చంద్రబాబు దృష్టికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీసుకెళ్లాలని బుద్దా వెంకన్న కోరారు.
పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నా ..
