సచివాలయంలో పోస్టుల సంఖ్య తగ్గింపు..

cbn-27-2.jpg

ఒక్కో సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సరైన పని లేకుండా ఉన్న వారిని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో కొందరికి పనులు లేవని, అటువంటి వారిని మండల స్థాయి, డివిజన్‌ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో నియమిస్తే సరిపోతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మిగతా శాఖల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి, పని లేకుండా ఉన్న గ్రామ సచివాలయ సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Share this post

scroll to top