నేడు చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ సమావేశం

cbn-29-2.jpg

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఈ రోజు సీఆర్డీఏ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది. రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ సాగనుంది. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు మంత్రి నారాయణ. మరోవైపు ఇటీవలే రాజధానిలో ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది ప్రపంచ బ్యాంక్, ఏడీబీ. అయితే, రాజధాని అమరావతిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై ఈ రోజు చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది. కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు భూములు కేటాయించే అంశంపైనా చర్చించే అవకాశం ఉందంటున్నారు.

Share this post

scroll to top