అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ థియేటర్లో పుష్ప టు సినిమా చూస్తూ మద్దానప్ప అనే 37 సంవత్సరాల అల్లు అర్జున్ అభిమాని మృతి చెందడం జరిగింది. సినిమా షో ముగిసిన తర్వాత కూడా అతను సీటులోనే కూర్చుని ఉండడంతో ప్రేక్షకులకు అనుమానం రావడం జరిగింది. దీంతో థియేటర్ యజమాన్యానికి ఈ విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత ఆ యువకుడు మరణించినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు.
పుష్ప-2 సినిమా చూస్తూ అభిమాని మృతి..
![pushpa-10.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2024/12/pushpa-10.jpg)