ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా..

ktrr-09.jpg

ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. ఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని కేటీఆర్ చెప్పారు. తనకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పానన్నారు. రేవంత్‌ ఇచ్చిన 4-5 ప్రశ్నలను అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారు. విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్‌ చెప్పారు. పైసలు పంపించానని చెబుతున్నా పైసలు అక్కడ ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. ఇక కరప్షన్ ఎక్కడిదని కేటీఆర్ అన్నారు. మరోవైపు మీడియాతో మాట్లాడితే పోలీసులకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు.

Share this post

scroll to top