హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే అక్కడ ఫిరాయింపులపై కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. గోవాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీ మారబోమని ప్రమాణం చేయించారన్నారు. పార్టీ ఫిరాయింపులు అనైతికమని స్పీకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారని తెలిపారు. స్పీకర్ ఆరు మాసాల్లోపు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మణిపూర్‌లో ఓ ఎమ్మేల్యేను అలాగే డిస్ క్వాలిఫై చేశారని తెలిపారు. అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉన్నప్పటికీ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ ఫోజులు కొడుతూ.. బయట ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
పార్టీ ఫిరాంపులపై చర్యలు తీసుకోవాలి..
