డేవిడ్ వార్నర్ పై షాకింగ్ కామెంట్స్..

rajandra-prasad-25.jpg

రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేద్రప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఎంతో అనుభవం గల నటుడు స్టార్ క్రికెట్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఏకిపారేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వార్నర్ కు బహిరంగ క్షమాపణలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Share this post

scroll to top