ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ మైలు రాయి..

malavika-24-.jpg

బట్టం బోలే’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. అలాగే తన నటనతో కూడా బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన ‘పేట’ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా వచ్చిన అన్ని చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ స్టార్ హీరో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే రీసెంట్‌గా ‘తంగలాన్’ సినిమాతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాజా సాబ్’ సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు ప్రభాస్‌తో నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌ లు కూడా రొమాన్స్ చేయబోతున్నారు.

Share this post

scroll to top