బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫ్యాషన్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పారిస్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రపంచ వేదికగా జరిగే ఫ్యాషన్ షోలకు కొత్త కళను తెస్తుంటుంది ఈ నీలి కళ్ల సుందరి. ఆయా వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ వైపే ఉంటాయి. తాజాగా ఐశ్వర్య పారిస్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది. పారిస్‌లోని ఐకానిక్ పలైస్ గార్నియర్ ఒపెరా హౌస్‌లో జరిగిన ఈ ఫ్యాషన్‌లో ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హొయలు పోయింది. బెలూన్ థీమ్ రెడ్ డ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులను నమస్తేతో పలకరించింది. ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఫ్లైయింగ్ కిస్‌తో ఆకట్టుకున్న ఐశ్వర్యరాయ్, ఆలియా భట్..
