నేను మిస్ చేసుకున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది..

Naniiiii-natural.jpg

ఇటీవల ‘హాయ్ నాన్న’ సినిమాతో హిట్ అందుకున్న నేనురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ మూవీతో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.జె సూర్య, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ వేరే లెవల్‌లో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 29న రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. షూటింగ్‌లో జోరు పెంచారు మూవీ టీమ్. ఇదిలా ఉంటే.. మన నేచురల్ స్టార్ నాని ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ అయ్యాడంట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తాను మిస్ అయిన మూవీ గురించి మాట్లాడుతూ.. ‘నాకు డేట్స్ కుదరక నేను ఓ సినిమా మిస్ అయ్యాను. అదే ‘రాజా రాణి’. అప్పుడు ఫుల్ బిజీగా ఉండటంతో ఇది నేను చెయ్యలేకపోయాను. కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.

Share this post

scroll to top