సైనికులకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది. వారి త్యాగం, ధైర్యం మన దేశ భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తాయి. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని భారత సైనికుల సంక్షేమం కోసం విరాళంగా అందించాలని నిర్ణయించుకున్నాం. మన సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. వారికి మనం ఏదో ఒక రూపంలో సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే సింగిల్ సినిమా విజయం సాధించిన సందర్భంగా, మేం ఈ చిన్న సాయం చేయాలని నిర్ణయించాము. భారత్ మాతాకీ జై’ అని అల్లు అరవింద్ గట్టిగా నినదించారు. దీంతో అక్కడున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ అల్లు అరవింద్ ను అభినందించారు.
గొప్ప మనసు చాటుకున్న నిర్మాత అల్లు అరవింద్..
