మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. ‘థాంక్యూ.. నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్టుతో జెన్యూన్ గా థాంక్స్. బన్నీ సినిమాలను, ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకు థాంక్స్. కేవలం మీడియాకు థాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్ కు వెళ్తున్నాను. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము మళ్లీ మళ్లీ చెప్తున్నా ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు నిజంగా అలాంటి ఘటన జరగడం దురదృష్టకరం.
నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అనుకోకుండా జరిగిన ఘటన’ అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించిన ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ మీడియా వారికి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియాకు కూడా స్పెషల్ థాంక్స్. బన్నీ సినిమాలను, ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకు థాంక్స్. కేవలం మీడియాకు థాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను” అని అన్నారు.