పుష్ప-2 పబ్లిక్ టాక్ దద్దరిల్లుతున్న థియేటర్లు..

pushpa-5.jpg

పుష్ప పుష్పరాజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. బుధవారం రాత్రి నుండే ప్రీమియర్ షోలు ఆడడంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా అంతేగా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రతిచోట నుండి సినిమాకు భారీ పాజిటివిటీ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు తగ్గేదేలే అంటున్నారు. కచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ అల్లు అభిమానులు అంటున్నారు. 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలను అధిగమించి రికార్డులు సృష్టిస్తోంది.

Share this post

scroll to top