పాట్నా గడ్డపై పుష్పరాజ్‌కు జన నీరాజనం..

pushappa-18.jpg

బిహార్ రాజధాని పాట్నా వేదికగా పుష్ప 2 ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. గతంలో ఎన్నడూ ఏ భారతీయ సినిమాకు జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుష్ప 2 ట్రైలర లాంఛింగ్ ఈవెంట్ కు సుమారు 2 లక్షల మంది జనాలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక భద్రతా పరంగా ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు ఈ కార్యక్రమంలో గస్తీ కాశారు. కాగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం భారీ పోలీస్ బందోబస్త్ ను ఏర్పాటు చేసింది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఈ ఈవెంట్ లో బందో బస్తు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫ్లవర్‌ కాదు వైల్డ్ ఫైర్’ అని డైలాగ్ చెప్పి అలరించాడు. ఇదే సందర్భంలో ‘నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో మాత్రం మీరందరూ నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా’ అని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశాడు బన్నీ ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 ట్రైలర్ పైనే చర్చ నడుస్తోంది. ఇక ఇప్పటికే యూట్యూబ్ లో ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. మొత్తానికి ‘అంతకుమించి’ అన్నట్లు పుష్ప 2 ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

Share this post

scroll to top