తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. వీటిల్లో అభయ హస్తం కింద ఆరు గ్యారంటీలను కూడా ప్రకటించింది. ఎన్నికల తర్వాత అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో పలు పథకాలు అమలులోకి వచ్చాయి. ఉచిత బస్ స్కీమ్ విజయవంతంగా అమలు అవుతోంది. ఇంకా రూ. 500కే సిలిండర్ కూడా అమలులోకి వచ్చింది. అలాగే ఆరోగ్య శ్రీ లిమిట్ పెంచేశారు. అదేసమయంలో ఇందిరమ్మ ఇండ్లను కూడా అతిత్వరలోనే ప్రారంభించనున్నారు. ఇక రైతు రుణ మాఫీ కూడా జరుగుతోంది. ఇలా ప్రభుత్వం ఒక్కో స్కీమ్‌ను అమలు చేస్తూ వస్తోంది. కేవలం ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ సర్కార్ చాలా హామీలు ఇచ్చింది. వీటిల్లో అంబేద్కర్ అభయ హస్తం స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి, పపూర్తి స్థాయిలో పథకం అమలు చేస్తామని తెలిపింది.
ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం..
