గుర్తుతెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ..

ambadhaker-22.jpg

అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు.ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.అది గమనించిన గ్రామస్తులు, దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా గల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని వారి ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంఘీభావం తెలిపారు. కాగా, నిందితుల కోసం డాగ్ స్క్వాడ్‌ను పోలీసులు రంగంలోకి దింపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this post

scroll to top