చలికాలంలో తింటే ఎన్ని ప్రయోజనాలో..

usiri-11.jpg

చలికాలంలో విరివిగా దొరికే సీజనల్ కాయగూరలో ఉసిరి ఒకటి. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి శారీరక జీవక్రియల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. బయటి కాలుష్యంవల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలోనూ సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

ఉసిరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు సహా పలు ఔషధ గుణాలు ఉంటాయి. ఆహారంలో భాగంగా దీనిని ఉపయోగించడంవల్ల ఏజింగ్ లక్షణాలు రాకుండా అడ్డుకుంటుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక అల్జీమర్స్‌తో పోరాడే వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో, పురుషుల్లో వీర్య కణాల అభివృద్ధికి అవసరమైన పోషకాలు ఉసిరిలో ఉంటాయి.

చలికాలంలో వాయు కాలుష్యంతో సఫర్ అవుతున్న వారికి ఉసిరి చేసే మేలు ఇంతా అంతా కాదంటున్నారు నిపుణులు. దీనితో తయారు చేసిన ఆహారాలు, పచ్చళ్లు, పానీయాలు కూడా మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలెర్జీల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. అలాగే ఫంగస్, క్యాన్సర్ నిరోధకంగా కూడా ఉసిరిలోని పోషకాలు ఉపయోగపడతాయి. జీవ కణాల్లో డీఎన్ఏ‌కు రక్షణ కల్పించడంలోనూ సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ట్రోఫ్టోఫాన్, మెథియోనైన్ వంటి పోషకాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉండటంవల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో ఉసిరి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Share this post

scroll to top