బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాలలు భారీ వర్షాలతో అతలాకుతలం చేసింది. దీంతో అనేక జిల్లాల్లో వదరలు రావడంతో జనజీవన ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఏపీలో విజయవాడ మహానగరం అయితే నేటికి కూడా వరదల్లో చిక్కుకుని ఉంది. ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తీరం దాటినప్పటికీ మంగళవారం తెల్లవారు జామున బలహీన పడినట్లే వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో, వర్ష సంబంధిత సంఘటనలు , వరదలలో కనీసం 17 మంది మరణించగా, తెలంగాణలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నుండి నిరంతరాయంగా వర్షాలు కురిపించడంతో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. అయితే విశాఖలో వాయుగుండం బలహీనపడినట్లు అధికారులు వెల్లడించారు. వాయుగుండం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.