కొన్నింటిని పట్టించుకోకూడదు అనుకుంటాం. పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. అంతటి మానసిక ధృఢత్వం వందలో ఒక్కరికుంటుంది. నాకైతే లేదు అంటూ తన బలహీనతను బహిర్గతం చేసింది బాలీవుడ్ భామ అనన్య పాండే. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న బాధల గురించి ప్రస్తావిస్తూ ఆమె పై విధంగా స్పందించింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ నా ఫస్ట్ సినిమా. ఆ సినిమా టైమ్‌లో నాపై ఏవేవో వార్తలు వస్తుండేవి. వాటిలో ఒకటి మాత్రం నన్ను చాలా బాధించింది.
ఎవరో ఓ వ్యక్తి ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, తను నా క్లాస్‌మెట్ అయినట్టు పోస్టులు పెట్టేవాడు. నా ఇంటర్వ్యూలలో నా కాలేజ్, స్కూల్ విషయాల గురించి నేను అన్నీ అబద్ధాలు చెబుతున్నానని ఇన్‌స్టాలో కామెంట్లు చేసేవాడు. వాటిని జనం పట్టించుకోరులే అనుకున్నా. కానీ అవే బాగా ట్రోల్ అయ్యాయి. అవి నన్నెంతో బాధించాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి. నేను మానసికంగా అంత బలమైన వ్యక్తిని కాదు. అందుకే.. ఈ బాధ నుంచి బయట పడేందుకు థెరపీ తీసుకోవాల్సొచ్చింది.’ అంటూ గుర్తుచేసుకుంది అనన్య పాండే.