బుల్లితెర మీద తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించిన అనసూయ ఇప్పుడు పూర్తిగా సిల్వర్ స్క్రీన్ పైనే కనిపిస్తుంది. స్మాల్ స్క్రీన్ పై కెరీర్ సాఫీగానే సాగిపోతున్నా బయటకు వచ్చి డేర్ స్టెప్ వేయకపోతే కష్టమే అనుకుని అనసూయ నిర్ణయించుకుంది. ఇక క్షణం సినిమా నుంచి అనసూయ ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అనసూయ లేటెస్ట్ గా ఒక రియాలిటీ షోలో జడ్జిగా పాల్గొంటుంది. ఈ షోలో శేఖర్ మాస్టర్ కూడా మరొక జడ్జిగా ఉండగా శ్రీముఖి ఈ షోకు హోస్ట్ గా చేస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ షోలో తను పవన్ కళ్యాణ్ తో ఒక సాంగ్ చేశానన్న విషయాన్ని చెప్పింది అనసూయ. ఫస్ట్ టైం బుల్లితెర మీద తాను చెబుతున్నానని.. తాను పవన్ కళ్యాణ్ తో ఒక సాంగ్ చేశానని అది ఒక రేంజ్ లో ఉండబోతుందని అంచనాలు పెంచారు అనసూయ. అనసూయతో పవన్ కళ్యాణ్ స్పెషల్ సాంగ్ అసలైతే ఎప్పుడో చేయాల్సింది. అత్తారింటికి దారేది సినిమా టైం లోనే ఇది జరగాల్సింది కానీ అప్పుడు అనసూయ ఆఫర్ ని కాదన్నది. కెరీర్ లో తనదైన పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తున్న అనసూయ ఇప్పుడు పవన్ తో సాంగ్ కి ఓకే చెప్పింది. అప్పుడు ఎందుకు కాదందో ఇప్పుడు ఎందుకు చేసిందో కానీ అనసూయ పవర్ స్టార్ తో స్పెషల్ సాంగ్ మాత్రం మంచి నిర్ణయమే అని చెప్పుకోవాలి. ఐతే అనసూయ పవన్ కళ్యాణ్ తో సాంగ్ చేశానని చెప్పింది కానీ అది ఏ సినిమాలో అన్నది మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం పవన్ కి సంబందించిన 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ తో స్పేషల్ సాంగ్…
