తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట లభించింది. బెట్టింగ్ యాప్ కేసులో ఆమెను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది. ఇదే సమయంలో ఈ నెల 24వ తేదిన పోలీస్ విచారణకు హాజరుకావాలని శ్యామలను కోర్టు కోరింది. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు ఆమె. దీనిపై నేడు హైకోర్టులోవిచారణ జరగనుంది. ఇరు వాదనలు విన్న కోర్టు ఆమెను ఆరెస్ట్ చేయవద్దంటూ పోలీస్ శాఖను ఆదేశించింది.
హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట..
