మాములుగా ఉండదు వెంకాయమ్మ గారితో..

pularao-28.jpg

చిలకలూరిపేటలో పతాక స్థాయికి చేరిన పోలీసుల స్వామి భక్తి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన పోలీసులు ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, ఎక్సైజ్ సీఐలు చప్పట్లు కొడుతుండగా ప్రత్తిపాటి వెంకాయమ్మ కేక్ కట్ చేశారు. వెంకట కుమారి ఆలియాస్ వెంకాయమ్మ W/o ప్రత్తిపాటి పుల్లారావు. వివాదాలకు కేరాఫ్. ఇప్పుడే కాదు గతంలోనూ పలు వివాదాల్లో ఉన్నారు వెంకాయమ్మ. గత టీడీపీ ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఫీజు చెల్లించకుండా టోల్‌ గేట్ దాటేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడి సిబ్బంది వెంకాయమ్మను అడ్డుకున్నారు. ఆసమయంలో ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నారు. మంత్రి భార్యనైన నన్నే అడ్డుకుంటారా అంటూ టోల్‌గేట్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారామె. పుల్లారావు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం మొత్తం ఆమె కనుసన్నల్లోనే ఉంటుందన్న విమర్శలున్నాయి. 

Share this post

scroll to top